My interests keep varying from dramatics to Do It Yourself stuff to anything that I chance upon. Please use the side menu buttons to share my stories. Currently, I am interested in poetry in telugu following some poetic meter. Some selected poems are given below:
-
There are four questions in the poem, written in kandam with some additional structural restrictions. All the letters are short, and there are 64 of them in total. If you arrange them in the form of an 8 x 8 matrix, and read the two princial diagonals, you will get the answers to the questions posed in the poem. This is watermarking/cryptography in action.
క్రమాలంకార ద్వికర్ణ బంధ సర్వలఘు కందం||
బిలమున చెదలకి గలరొద?
కలల అలల బిరుదుకి రవికయగు లలన వాం
జ్ఞ్మలము? వికలహృదయ కలము?
లలన జడవిరియగ కుశములవలెయది శభo?
-
Written in kandam with some additional structural restrictions. All the letters are short, and there are 64 of them in total. If you arrange them in the form of an 8 x 8 matrix, and read the first princial diagonal (a Bishop's move in the game of chess), you get a sensible sequence of letters formaing a sentence, not just random letters.
కర్ణ బంధ సర్వలఘు కందం||
లలితపద వనరుహనయని,
జలధిని సమకొను సురసరజని, విభుని తపం
బులను, ధిషణు వచనమునను
పులకరములు బడయునటుల పురిగొలుపు భువిన్
-
-
Written in kandam with some additional structural restrictions. All the letters are short, and there are 64 of them in total. If you arrange them in the form of an 8 x 8 matrix, and read the letters following a Knight's move (in the game of chess), you get a sensible sequence of letters formaing a sentence, not just random letters.
చ‘తురంగ’గతి బంధ కందము||
కలువ తళుకుబెళుకుల చెలి
యల కులుకులొలుకు కనులవియగు జిగిబిగి సొం
పుల శృతిలయగతులు వలపు
గొలుసులు ముడిపడి అలజడి గొలిపె నిలకడన్
-
Admiring the Punjabis (aaTaveladi meter)
ఆ.వె||
సిక్కుజాతి సమర సింహముకు జయహో.
ఉక్కుకండకు, నిప్పు గుండెలకు ప్రణతులు. జయహో
కర్షక కులతిలక. గైకొను జోతలు
శౌర్యపరాక్రమశోభితసైనికాగ్రేశరా.
-
Expressing my inability to write in "utpalamala" (utpalamaala meter)
ఉ||
వృత్తము వ్రాయగన్ జడిసి వేరొక మార్గము లేకనే కదా,
చిత్తము పోరగన్, వగచి, చెత్తగ వృత్తము గీసితిన్, చఛా!
బెత్తము తీయకండి మరి బేరుమనేడ్వగలన్. కృపాకరా,
విత్తము నాటితిన్ ఇపుడె, విత్తులు, రూకలు సేకరించగాన్!
-
Greetings to a friend ( kandam meter)
కం||
సత్సంప్రదాయము నిలుపు,
సత్సంఘము నెఱుపు, వెలయ సద్భావనముల్.
సత్సంపద లొనగూరునె
సత్సంకల్పబలమున్న(ను. ఓ) సద్గుణరాశీ!
-
About my village -1 ( kandam meter)
కం||
నవ్యనురాగాది గుణము
లవ్యయమౌ సుజలధాతులహరీధాత్రిన్,
హవ్యవనవాణిగ వినుడు!
దివ్య కృపన్, దేవుపల్లి దేవుని పల్లే!
-
About my village -2 ( kandam meter)
కం||
నవసింగారములొలికెడి
జవనియె. కల్మషమెఱుగని జనహృది తనెక
ల్పవనిత. సుఫల చరిత. సుద
తివరేణ్యిల. దేవుపల్లి దేవునిపల్లే!
More in my telugu blog
here